వనపర్తి సంస్థాన వారసుడిని కలిసిన జిల్లా ఎస్పీ

వనపర్తి సంస్థాన వారసుడిని కలిసిన జిల్లా ఎస్పీ

వనపర్తి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

గురువారం వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి సంస్థాన వారసుడు శ్రీ రాజా కృష్ణదేవరావు ను నాగవరం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు.

సంస్థాన విశేషాలను తెలియజేసిన రాజా కృష్ణదేవరావు, 450 సంవత్సరాల పాటు సాగిన వనపర్తి సంస్థాన చరిత్ర, పాలనా కాలంలో ప్రజలకు అందించిన వ్యవసాయ, వాణిజ్య, తాగునీటి సౌకర్యాలు, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక పరిజ్ఞానం తదితర వివరాలను ఎస్పీతో పంచుకున్నారు. అదనంగా, “సూగూరు సిక్క్” పేరున వనపర్తి సంస్థానానికి ప్రత్యేక కరెన్సీ ఏర్పాటు చేసి నిజాం రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యేలా అనుమతులు ఉండేవని వివరించారు.

ఈ సమావేశంలో వనపర్తి పట్టణ మరియు జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులను రాజా కృష్ణదేవరావు ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అవసరమైన సందర్భంలో తమవంతు సహకారం అందిస్తామని రాజా కృష్ణదేవరావు ఎస్పీకి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .