శ్రీ చైతన్య కరికులం పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా.!

శ్రీ చైతన్య కరికులం పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా.!

సత్తుపల్లి, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక సత్తుపల్లి విద్యాలయం, శ్రీ చైతన్య కరికులం పాఠశాలలో దీపావళి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ మొత్తం రంగవల్లులు, దీపాలతో నిండిపోగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రిన్సిపాల్ ఆర్. నాగరాజు మాట్లాడుతూ, దీపావళి చెడుపై మంచి గెలిచిన సంకేతం. ఈ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. పిల్లలు దీపావళి సారాన్ని తెలుసుకుని, పర్యావరణాన్ని కాపాడుతూ పటాకులు పేల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. రసాయనాల వాడకాన్ని తగ్గించి పచ్చదనంతో పండుగ జరుపుకోవాలి అని సూచించారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డీన్, ఇన్‌చార్జ్, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులతో కలసి దీపాల కాంతుల్లో ఆనందాన్ని పంచుకున్నారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.IMG-20251017-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .