పంట పొలాలను నిస్సారం చేయొద్దు
◆ పత్తి, వరి కొయ్యలను కాల్చకుండా పంట పొలాల్లోని భూసారాన్ని, వాతావరణాన్ని పరిరక్షించుకుందాం
◆ జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య
ఖమ్మం బ్యూరో, నవంబర్ 26, తెలంగాణ ముచ్చట్లు;
పంట పొలాల్లో పత్తి, వరి కొయ్యలను తగులబెట్టి సారవంతమైన భూమిని నిస్సారం చేయొవద్దని జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య రైతులకు సూచించారు. ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం, చింతగుర్తి, పరికలబోడుతండాలో బుధవారం జిల్లా వ్యవసాయాధికారి సందర్శించారు. ఈ సందర్భంగా అయన రైతులతో మాట్లాడారు. సాగుచేసిన పొలంలో వ్యర్ధాలను తగులబెడుతున్న రైతులకు అవగాహన కల్పించారు. ఇలా చేయడం వలన భూమిలో పంటలకు మేలు చేసే బాక్టీరియా నశించిపోతుందని, తద్వారా పంట దిగుబడి తగ్గుతుందని వివరించారు. అనంతరం పత్తి, మిర్చి పంటలను పరిశీలించారు. వర్షాలకు పత్తి దెబ్బతిని పోయిందంటూ రైతులు ఆయనకు ఎకరువు పెట్టారు. మిర్చిపై తక్కువ ఫెస్టిసైడ్స్ వాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమమంలో ఆయన వెంట ఏఈఓ బాలబత్తుల శిరిణ్మయి తదితరులు పాల్గొన్నారు.


Comments