డాక్టరేట్ అవార్డు గ్రహీత సతీష్ యాదవ్ కు ఘన సన్మానం
వనపర్తి,ఆగస్టు19 ( తెలంగాణ ముచ్చట్లు):
గ్లోబల్ ఆక్రిడేషన్ కౌన్సిల్, పాండి యూనివర్సిటీ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్ నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కి పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మంగళవారం ఉదయం వారి నివాసంలో శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక తెలంగాణ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, కాటేపాగ హుస్సేన్ , డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, జనం పవర్ పత్రిక జిల్లా స్టాపర్ గంధం రవికుమార్, ఎం కురుమయ్య తెలుగు సత్తా పత్రిక మండల రిపోర్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంధం రవికుమార్ మాట్లాడుతూ
గత 25 సంవత్సరాలుగా సమాజ సేవ, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం, దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు ప్రముఖులకు ఈ గౌరవ డాక్టరేట్లను ప్రధానం చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి సామాజిక సేవ,ప్రజల శ్రేయస్సు విభాగంలో సతీష్ యాదవ్ ను ఎంపిక వనపర్తి జిల్లాకు గర్వించదగ్గ విషయం. మీకు లభించిన గౌరవానికి దోహదపడిన వనపర్తి పట్టణ, జిల్లా ప్రజానీకానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాలి. ఇది రాబోవు కాలంలో వనపర్తి జిల్లా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఉపయోగ పడుతుంది అన్నారు.


Comments