హనుమాన్ విగ్రహనికి మల్లన్న యాదవ సంఘం నుంచి విరాళం.

హనుమాన్ విగ్రహనికి మల్లన్న యాదవ సంఘం నుంచి విరాళం.

చర్లపల్లి, నవంబర్ 24 ( తెలంగాణ ముచ్చట్లు ):

 ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ లో కుషాయిగూడ బస్‌స్టాప్ సమీపంలో హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులకు శ్రీ మల్లన్న యాదవ సంఘం (కుషాయిగూడ) సభ్యులు ఔదార్యాన్ని చూపారు.  సంఘం అధ్యక్షులు శీలం అనిల్ యాదవ్, ముఖ్య సలహాదారుడు గుంటి ఆంజనేయులు రూ.51,116 విరాళాన్ని సమితికి అందజేశారు.  ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహ నిర్మాణ సమితి కన్వీనర్ చల్లా ప్రభాకర్ మాట్లాడుతూ.. విగ్రహ నిర్మాణంలో భాగంగా గర్భాలయం, ముఖ ద్వారం వంటి కీలక పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.  భక్తుల సహకారంతో ఈ దేవాలయ కార్యక్రమం మరింత శీఘ్రంగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  విగ్రహ నిర్మాణానికి ప్రతి భక్తుడు తన వంతు సహాయాన్ని అందించాలని కోరారు. మల్లన్న యాదవ సంఘం చేసిన విరాళాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా నిర్మాణ కార్యక్రమంలో సహకరిస్తున్న కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, బజరంగ్ దళ్ కుషాయిగూడ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు.  కార్యక్రమంలో సమితి సభ్యులు యావపురం రవి, పనగట్ల చక్రపాణి గౌడ్, తాళ్ల ఆనంద్ గౌడ్, ఆర్. వెంకులు, పాండాల గణేష్ గౌడ్, దయానంద్, పిట్టల రాజు, లక్ష్మణ్ గౌడ్, రామకృష్ణతో పాటు మల్లన్న యాదవ సంఘం సభ్యులు ఏ. కృష్ణ యాదవ్, జి. శ్రీనివాస్ యాదవ్, బి. గోపాల్ యాదవ్, జె. రవి యాదవ్, జి. గోపాల్ యాదవ్, ఎం. స్వామి యాదవ్, జై రమేష్ యాదవ్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .