సన్నరకం ధాన్యం బోనస్ విషయంలో ఆపోహలొద్దు

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సన్నరకం ధాన్యం బోనస్ విషయంలో ఆపోహలొద్దు

IMG-20241106-WA0011హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

సన్న రకం ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ విషయంలో ఎలాంటి అపోహలొద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. 
బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద డిఆర్డిఏ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

 ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద  రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. వరి కోతలు, ధాన్యం గురించి స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఆరబోసిన ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం గురించిన వివరాలతో పాటు  సుమారుగా ఎంత ధాన్యం రానుందనే వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సన్న దొడ్డు రకం దాన్యం ఎంత మేరకు వచ్చిందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వాతావరణ వివరాలను రైతులకు తెలియజేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసు కున్నారు. రైతులు సన్న రకం ధాన్యం బోనస్ అంశాన్ని గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా దానిపై కలెక్టర్ వివరణ ఇచ్చారు.

 అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి  ఎక్కువ శాతం  సన్న రకం దాన్యం వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకే  ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన 8 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిపారు . ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన అనంతరం దాన్యాన్ని వెంటనే తరలించేందుకు మిల్లుల ట్యాగింగ్ తో పాటు గోదాంల ట్యాగింగ్ కూడా చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేయగా వందకు పైగా  దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు  చేపట్టినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  ప్యాడి క్లీనర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్ద కేంద్రాలలో డ్రయ్యర్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చామని, డ్రయ్యర్ల  ను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులోకి తీసుకురావడం వలన నిబంధనల మేరకు మాయిశ్చర్ రావడానికి అవకాశం ఉన్నందున ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. సన్న రకం ధాన్యానికి  ప్రభుత్వం ప్రకటించిన బోనస్  రూ. 500లు  ఓపీఎంఎస్ ట్యాబ్ ఎంట్రీ  అయిన వెంటనే సంబంధిత రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని పేర్కొన్నారు. సన్న రకం ధాన్యానికి సంబంధించిన బోనస్ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు  పోవద్దన్నారు. హనుమకొండ జిల్లాలో కమలాపూర్, ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో చాలావరకు వరి కోతలు పూర్తయ్యాయని, ఈ మండలాల నుండే  ఎక్కువ ధాన్యం వస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. వరి కోతలు పూర్తి చేసుకుని ముమ్మరంగా ధాన్యం రానున్న నేపథ్యంలో  ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. 

 ఈ సందర్భంగా డిఆర్డిఓ నాగ పద్మజ, తహసిల్దార్  జగత్ సింగ్, వ్యవసాయ, డిఆర్డిఏ  అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .