నవీన్ యాదవ్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేసిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి
వనపర్తి,నవంబర్08(తెలంగాణ ముచ్చట్లు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రచారం చేపట్టారు.
శనివారం మధురనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య రెడ్డి ,ఏఐసీసీ పరిశీలకులు కుసుమ కుమార్ కలిసి గడపగడప తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని, నవీన్ యాదవ్ యువ నాయకుడిగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అత్యవసరమని ఆయన అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా కోర్ట్ ప్లీడర్ కిరణ్ కుమార్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్, వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, సీనియర్ నాయకులు మెంటేపల్లి రాములు, ఎంట్ల రవి, కోళ్ల వెంకటేష్ సురేష్, పాండురవ్, రమేష్, రాంజీ నాయక్, అలాగే ఏఐసీసీ విభాగ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments