నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి
వనపర్తి,సెప్టెంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణానికి చెందిన మునీర్ కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయిన వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు, ఏఐపిసి నేషనల్ హెడ్ (హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్) డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి, నేడు వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అనీష్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, పెబ్బేర్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్, సీనియర్ నాయకులు ఎంట్ల రవి, పాష, ఇమ్రాన్, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments