ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి నియామకం

మర్యాదపూర్వకంగా కలిసిన వికలాంగుల సంఘం అధ్యక్షులు గంజాయి రమేష్

ఏఐపిసి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి నియామకం

వనపర్తి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి ని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది.

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రధాన అతిథిగా హాజరై, కార్యకర్తలకు ప్రోత్సాహం అందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ ఆదిత్య రెడ్డి గతంలో ఏఐటిసి హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ నేషనల్ హెడ్ గా సేవలందించారు. వనపర్తి నియోజకవర్గంలో యువ నాయకుడిగా ప్రజల్లో విశ్వాసం సంపాదించిన ఆయనకు పార్టీ అధిష్టానం రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా వనపర్తి జిల్లా వికలాంగుల కమిటీ అధ్యక్షులు గంజాయి రమేష్ డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. అధ్యక్షులు మాట్లాడుతూ.. ఆదిత్య రెడ్డి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఎం. దేవన్న యాదవ్, మున్నూరు జయకర్, పి. యాదగిరి, అజీమ్ తదితరులు పాల్గొని డాక్టర్ ఆదిత్య రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!