పుట్ట వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి
వనపర్తి,సెప్టెంబర్27(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి పట్టణం 6వ వార్డుకు చెందిన పుట్ట ఆంజనేయులు భార్య పుట్ట వరలక్ష్మి మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా వరలక్ష్మి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, “ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం ఎంతటి బాధో వర్ణించలేనిది. కానీ ధైర్యంగా నిలబడాలి. వరలక్ష్మి లేని లోటు ఎప్పటికీ తీరనిది కానీ, కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.
డాక్టర్ చిన్నారెడ్డి వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగి వేణు, కోళ్ల వెంకటేష్, నందిమల్ల రాము, గౌనికాడి తిరుపతయ్య, జక్కుల నాగరాజు మేస్త్రి, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.


Comments