ప్రతి స్త్రీ విముక్తికి విద్య కీలకం - గుండాల కృష్ణ 

యస్.బి.ఐ.టి. లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం 

ప్రతి స్త్రీ విముక్తికి విద్య కీలకం - గుండాల కృష్ణ 

 సావిత్రీబాయి పూలే 194వ జయంతిని కొనియాడిన మహిళా విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు

ఖమ్మం బ్యూరో , తెలంగాణ ముచ్చట్లు:

సమాజంలో స్త్రీకి విముక్తి కేవలం విద్య ద్వారానే లభిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే అని యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. స్త్రీల అణిచివేతకు, సామాజిక మరియు ఆర్థిక స్వాతంత్య్ర్యం కోసం విద్య మాత్రమే పరిష్కారం చూపిస్తుందని కృష్ణ తెలిపారు. శుక్రవారం కళాశాల ఆవరణలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే 194వ జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళల సదస్సులో విద్యార్ధినులు మరియు ఉపాద్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేవలం మహిళలను చైతన్య పరచడమే కాక తను చదువుకోవడంతో పాటు, సొంతంగా స్కూల్ను స్థాపించి ఇతర మహిళలకు విద్యను అందుబాటులో ఉంచి ఆదర్శంగా నిలిచారని వారు తెలిపారు. దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ను గౌరవించుకోవడం యావత్ మహిళా సమాజాన్ని గౌరవించుకోవడమే అని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. ఆనాటి సామాజిక రుగ్మతులకు వ్యతిరేకంగా పోరాడి నిబడటమే కాక స్టెఫెండ్లను అందించి మరీ విద్యను ప్రోత్సహించే వినూత్న విధానం చాలా మంది మహిళలను మొదటిసారిగా తరగతి గదుల్లోకి అడుగు పెట్టేలా ప్రోత్సహించింది అని వారు కొనియాడారు.
సావిత్రిబాయి పూలే కేవలం మహిళా సమజోధరణకి పరిమితం కాలేదని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడి, వితంతు పునర్వివాహాలకు మద్దతు ఇచ్చాని కళాశాల వైస్ ఛైర్ పర్సన్ గుండాల కవిత తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాణ్యం మహిళా ఉపాధ్యాయులందరిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల మహిళా అధ్యాపకులు, విద్యార్థినులతో పాటు కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .