విద్య ద్వారానే పేదరికం నుండి శాశ్వత యుక్తి లభిస్తుంది 

విద్య ద్వారానే పేదరికం నుండి శాశ్వత యుక్తి లభిస్తుంది 

గురుకులాలు విద్యార్థుల పాలిట వరం 
                                                                                      ఎమ్మెల్సీ శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

ఖమ్మం బ్యూరో , నవంబర్ 12, తెలంగాణ ముచ్చట్లు;

తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల కళాశాల & బాలికలు -2 నందు  ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మీ అధ్యకతన దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భముగా మైనారిటీ డే  & నేషనల్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించుట జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ  శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే పేదరికం నుండి శాశ్వత యుక్తి లభిస్తుందని గురుకులాలు విద్యార్థుల పాలిట వరం అన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ నాయకత్వంలో క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం మైనార్టీ విద్యపై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేసిందని ప్రత్యేకంగా మైనార్టీ బాలికల విద్యపై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మీ పాఠశాల నివేదికను సమర్పిస్తూ పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని విద్యార్థులు చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అనంతరం జమాఅతె  ఇస్లామీ హింద్ జిల్లా మీడియా సెక్రటరీ అబ్దుల్ మలిక్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దృష్టిలో దేశ స్వాతంత్ర్యం అంటే, కేవలం పరాయి పాలన నుండి విముక్తి పొందడం కాదు. అది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు - అందరూ కలిసిమెలిసి, ఒకే భారతీయులుగా జీవించగల ఒక సమైక్య భారతాన్ని నిర్మించడం. అమ్మాయిలు తాను తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు దానికి నిదర్శనం మహిళ ప్రపంచ వరల్డ్ కప్ సాధించడమే మీరు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం లో ఆర్. రంగారావుగారు పి ఆర్ టి యు స్టేట్  జనరల్ సెక్రటరీ,  యలమద్ది వెంకటేశ్వరరావు హెల్పింగ్ హ్యాండ్ కన్వీనర్, సోమిరెడ్డి శ్రీనివాసరావు పి ఆర్ టి యు ఆడిట్ కమిటీ, చింతూలూరి ప్రసాద్ ఏ ఐ ఎఫ్ టి యు మెంబర్,ఖమ్మం,రీజినల్ లెవెల్  కో ఆర్డినేటర్ ఎం. జె. అరుణ కుమారి, విజిలెన్స్ ఆఫీసర్స్ కె. సీతారాములు, రవూఫ్ ఈ సందర్భంగా విద్యలో రాణించిన  విద్యార్థులకు మెమొంటోస్ అందజేశారు విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాల తో అలరించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయునిలు, తల్లిదండ్రులు పాల్గొన్నారుIMG-20251112-WA0076

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .