వికలాంగుల సమస్యల పరిష్కరానికి కృషి
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో మంగళవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమం కోసం తన సహకారాన్ని అందించడమే కాకుండా వారికి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, “వికలాంగుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చి, గౌరవాన్ని కల్పించే విధంగా చర్యలు చేపడతాను. మీ సమస్యల పరిష్కారం కోసం రెండు నెలల్లో కఠిన చర్యలు తీసుకుంటాను,” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ జన్ను శీభారాణి, అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు జన్ను సుధాకర్, బుద్దే పెద్దన్న, జన్ను అభిషేకం, అరుణకర్, గాదె రాము, మైనార్టీ నాయకులు అంజత్, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అఖిల్, ఇతర స్థానిక నాయకులు, వికలాంగులసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments