విద్యుత్ షాక్ తో విద్యుత్ కార్మికుడు మృతి
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలానికి చెందిన మునగల శెట్టి రవి గత కొంతకాలంగా అడ్డాకుల సబ్ స్టేషన్ లో కాంట్రాక్టు బేసిక్ విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం విద్యుత్ మరమ్మత్తుల విషయంలో అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో విద్యుత్ స్తంభం ట్రాన్స్ఫారం బంపర్ మారుస్తూ కరెంటు షాక్ గురై మునగల శెట్టి రవి (30) మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కాటవరం గ్రామంలో కరెంటు లేకపోవడంతో ట్రాన్స్ఫారం ఫ్యూజ్ మార్చడానికి రవి సబ్ స్టేషన్ లో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న గట్టప్ప్ కు ఫోన్ చేసి ఎల్సి ఇవ్వాలని కోరడమైనది. ఇంతలో ఏ తప్పిదం జరిగిందో తెలియదు కానీ రవి అడిగిన గ్రామానికి కాకుండా మరో గ్రామానికి ఎల్సి ఇవ్వడంతో ప్రమాదం జరిగి విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని రవి బంధువులు తెలిపారు. లైన్మెన్ తప్పిదం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని విద్యుత్ అధికారులపై పలువురు మండిపడుతున్నారు. చిన్న వయసులో రవి విద్యుత్ షాక్కు గురై మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం రవి కుటుంబాన్ని ఆదుకోవాలని, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులకు కోరుతున్నారు.


Comments