ధర్మసాగర్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు

 -భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ధర్మసాగర్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో డీఆర్డీఏ, మహిళా స్యయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్  భవనాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య బుధవారం పరిశీలించారు. 
సహకార శాఖ కు సంబంధించిన భవన సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను నెలకొల్పేందుకు నిర్ణయించగా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు కు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో మేన శ్రీను, ఎంపీడీవో అనీల్ కుమార్, డీపీఎం జన్ను ప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-12-04 at 9.40.03 PMధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి

 ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ లోని శ్రీవినాయక రైస్ మిల్లు ను కలెక్టర్ పరీశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మిల్లుకు వచ్చిన సన్న, దొడ్డు రకాల ధాన్యం, పట్టిన బియ్యం,  ధాన్యం తరలింపు, తేమ శాతం, గన్నీ సంచులు, తదితర వివరాలను అధికారులు, నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపునకు సంబంధించిన అంశాలను గురించి అధికారులు, నిర్వాహకులకు కలెక్టర్ పలు సలహాలు, సూచనలు చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .