ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుతే ఉత్తమ ఫలితాలు.      

కాళోజి జూనియర్ కళాశాల చైర్మన్ ఎస్.శ్యాంసుందర్ రెడ్డి.

ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుతే ఉత్తమ ఫలితాలు.      

హాసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:

 ప్రతి విద్యార్థి కష్టపడి క్రమశిక్షణతో సమయ పాలన పాటించి చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని కాళోజి జూనియర్ కళాశాల చైర్మన్ ఎస్ శ్యాంసుందర్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధి భీమారంలోని జగతి గార్డెన్ లో కాళోజీ జూనియర్ కళాశాల 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ ఎస్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రిన్సిపాల్, వైకెఎస్, డైరెక్టర్లు, సరస్వతి దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  కళాశాల చైర్మన్ మాట్లాడుతూ కాళోజి జూనియర్ కళాశాల స్థాపించి 11 సంవత్సరాల కాలంలో ఐదువేల మంది విద్యార్థులను వివిధ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారని గుర్తు చేశారు. మా కళాశాలలో చదువే విద్యార్థులందరూ అభివృద్ధి చెందాలని లక్ష్యంతో విద్యార్థులకు బోధన అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదువుతే ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు.అనంతరం ప్రిన్సిపాల్. వై కే ఎస్, మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను నైతిక విలువలను పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కే తిరుపతిరెడ్డి, ఇ.అనిల్ రెడ్డి, టి.మధుకర్ రెడ్డి, ఎం సంతోష్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .