ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి
జఫర్గడ్,తెలంగాణ ముచ్చట్లు: ధర్మపరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆ దిశగా అందరూ చేయి చేయి కలిపినప్పుడే సాధ్యం ధర్మ పరిరక్షణ అవుతుందని ధర్మ జాగరణ జిల్లా సంయోజక్ సత్యనారాయణ వివరించారు.
సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హిందూ చైతన్య రథయాత్ర గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని రామాలయంకు చేరుకుంది.
ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
అనంతరం సత్యనారాయణ మాట్లాడుచూ.. సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి వ్యక్తి నడుంకట్టినప్పుడే దేశంలో శాంతి-సౌభాగ్యం వెల్లివిరుస్తుందన్నారు. గతంలో ధర్మం నాలుగు పాదాల మీద నడించిందని పుస్తకంలో మనందరం చదువుకున్నామని, అలాంటి ధర్మం మళ్లీ నేటి సమాజంలో రావాలన్నారు.పురవీధుల గుండా నిర్వహించిన ఈ రథయాత్రకు విశేషమైన ఆదరణ లభించింది.ఈ కార్యక్రమంలో అంచూరి కమల,దాంశెట్టి శ్రావ్య, గందె సోమన్న,బోనగిరి శ్రవణ్ కుమార్ ,బెలిదె హరిశంకర్ , బజ్జూరి నాగమ్మ,అంచూరి ధనలక్ష్మీ,ఇమ్మడి భద్రయ్య, పాలకుర్తి సరోజన ,గందె సమత, ఇమ్మడి మాధవి తదితరులు పాల్గొన్నారు.


Comments