రైతు హామీల ఆమలు సదస్సుకు రైతులు భారీగా తరలిరండి
బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
ఈనెల 29న వనపర్తి పట్టణంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగే రైతు హామీల అమలు సదస్సుకు రైతులు భారీగా తరలిరావాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం పెద్దమందడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 29న చేపట్టిన రైతు హామీల సదస్సుకు సిద్దిపేట సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు రైతులకు మద్దతుగా రానున్నారు కాబట్టి కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ఎండగడుతూ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. రైతులకు మద్దతుగా మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మరియు మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా రానున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు హాజరుగానున్నారు కాబట్టి ఇట్టి సదస్సుకు మండలంలోని అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పెద్దమందడి మండల జడ్పిటిసి రఘుపతి రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, మండల అధ్యక్షులు వేణు యాదవ్, ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు పానుగంటి సురేష్ కుమార్, మాా్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, జిల్లా గొర్ల కాపరుల సంఘం డైరెక్టర్ నాగేంద్రం యాదవ్, సింగిల్ విండో మాజీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్, పెద్దమందడి గ్రామ అధ్యక్షులు సేనాపతి గ్రామ అధ్యక్షులు సేనాపతి మరియు మండల ముఖ్య నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు


Comments