అహ్మద్ గూడ డబుల్ బెడ్ రూమ్‌లో మౌలిక సదుపాయాల కోసం నిరాహార దీక్షలు
కీసర, తెలంగాణ ముచ్చట్లు:
అహ్మద్ గూడ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నాయకులు ఈనెల 18వ తేదీ సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఫేస్ వన్ కమిటీ అధ్యక్షుడు వి. విజయ్ కుమార్ మాట్లాడుతూ, పేదలకు ఇళ్లు కేటాయించినప్పటికీ, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి ప్రాథమిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని, పైగా ఎంక్వయిరీల పేరుతో లబ్ధిదారులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు తక్షణమే అన్ని బ్లాక్‌లకు జనరేటర్లు ఏర్పాటు చేయాలని, భవనాల్లో ఏర్పడిన పగుళ్లు, లీకేజీలను మరమ్మతు చేయాలని, ప్యానల్ బోర్డులకు గ్రిల్లులు అమర్చాలని, ఎస్టిపీలు నిరంతరం పనిచేసేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్ వరకు బస్సు సర్వీసులు పెంచాలని, అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్‌వాడి సెంటర్, రేషన్ షాప్, ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరారు.ప్రజల భద్రత కోసం విస్తృతంగా సీసీ కెమెరాలు అమర్చాలని, ప్రధాన సమస్యల పరిష్కారం వరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయని కమిటీ అధ్యక్షుడు వి. విజయ్ కుమార్, కార్యదర్శి షేక్ లతో పాటు సభ్యులు స్పష్టం చేశారు.


Comments