స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన తోటి స్నేహితులు
Views: 67
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల- మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుకున్న 2004 బ్యాచ్ కి చెందిన చంద్రాయుడు ఆకస్మికంగా మరణించడం జరిగింది. తమతోపాటు కలిసి పదవ తరగతి చదివిన తోటి స్నేహితుడు ఆకస్మికంగా మృతి చెందడంతో స్నేహితులందరు చలించి పోయారు. తమ మధ్య స్నేహితుడు లేకపోయినా మానవత్వ దృక్పథంతో స్నేహితుని కుటుంబానికి స్నేహితులందరూ అండగా నిలిచారు. 2004 బ్యాచ్ కు చెందిన స్నేహితులందరూ కలిసి చంద్రాయుడు కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. స్నేహితుని కుటుంబానికి భవిష్యత్తులో అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో 2004 బ్యాచ్ విద్యార్థులు, స్నేహితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments