పేదింటి పూల వ్యాపారి కూతురు పెళ్లికి ఆర్ధిక సహాయం
ఖమ్మం బ్యూరో,అక్టోబర్ 12, తెలంగాణ ముచ్చట్లు;
మానవత్వం చాటుకున్న ఖమ్మం టౌన్ ఫ్లవర్ మర్చంట్ యూనియన్ సభ్యులు ఖమ్మం నగరంలో స్థానిక జడ్పీ సెంటర్ అంబెడ్కర్ విగ్రహం ఎదుట పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద ముస్లిం షేక్. మదార్ తన కూతురు సబీయా బేగం వివాహానికి రూ. 25000/-ల ఆర్ధిక సహాయం ఈరోజు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఖమ్మం టౌన్ ఫ్లవర్ మర్చంట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్. మోయిన్, షేక్. ఖాజా మాట్లాడుతూ. ఖమ్మం నగర పరిధిలో సుమారు మూడు వందల పైబడి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పూలు, పూల దండలు, పూల బోకేలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వారిని ప్లవర్ మర్చంట్ యూనియన్ అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. పూల వ్యాపారుల కుటుంబాల్లో జరిగే శుభ కార్యాలకు ఈవిధంగా ఆర్ధిక సహాయం అందించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్లవర్ మర్చంట్ యూనియన్ సభ్యులు గౌరవ సలహాదారులు షేక్. మైముద్, కార్యదర్శి ఆర్ పీటర్, కోశాధికారి శాబాస్ అహ్మద్, కన్వీనర్ షేక్. ముజాయిద్దిన్, కార్యవర్గ సభ్యులు షేక్ నాగుల్ మీరా, వై వినోద్, డి.శేఖర్, షేక్. ఈసూబ్, కృష్ణ వేణి, లాల్ బీ, జానిబీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments