ఢిల్లీ వర్సిటీలో సీటు సాధించిన వంశీకి ఆర్థిక ఇబ్బందులు
ఢిల్లీ వర్సిటీలో బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ సీటు సాధించిన వంశీ
ఫీజు, హాస్టల్ ఖర్చులు లక్షకు పైగా ఉండటంతో ఇబ్బంది
-భర్తకు మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి
-కొడుకు చదువు కొనసాగించేందుకు దాతల సహాయం కోరుతున్న భూక్య మాజి
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండాకు చెందిన భూక్య మాజి తన కొడుకు చదువుల కోసం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కుటుంబ పరిస్థితులు దయనీయంగా ఉండటంతో, ఢిల్లీ వర్సిటీలో సీటు సాధించిన తన కొడుకు వంశీకి ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది.
ఇద్దరు కూతుర్లను డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసిన మాజి, తన చిన్న కుమారుడైన వంశీని ఇంటర్ వరకు చదివించింది. వంశీ ఇటీవల ఆలిండియా ప్రవేశ పరీక్ష రాసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సులో ప్రవేశం పొందాడు. అయితే అడ్మిషన్, హాస్టల్ ఫీజులు లక్ష రూపాయలకు పైగా ఉండటంతో వాటిని చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
20 ఏళ్లుగా భర్తకు మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి పనులు, హోటల్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మాజి ఇప్పుడు తన కొడుకు ఉన్నత విద్య కోసం సహాయం చేయాలని దాతల్ని కోరుతోంది. తన కుమారుడు చదువు కొనసాగించేందుకు సహకరించాలంటూ 7674852691 (భూక్య కళ్యాణి) నంబరుకు ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటోంది.


Comments