కుమ్మరి బస్తీ వద్ద వరద నీటి కాలువ పనులు ప్రారంభం
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కుషాయిగూడ, అక్టోబర్ 6 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవతో కుషాయిగూడ కుమ్మరి బస్తీ వార్డు కార్యాలయం సమీపంలో వరద నీటి కాలువ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.12 లక్షలు 50 వేల వ్యయంతో ఈ స్టార్మ్ వాటర్ పైప్‌లైన్ నిర్మాణం చేపట్టబడుతోంది.ప్రతీ వర్షాకాలం వచ్చేసరికి కుమ్మరి బస్తీ పరిసరాలు ముంపునకు గురవుతూ, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. కాలువ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో, ప్రతి వర్షం సమయంలో రహదారులు చెరువుల్లా మారి వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని స్థానికులు తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించాలంటూ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కుటుంబాలు మూడు నెలల క్రితం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వద్ద వినతిపత్రం సమర్పించాయి. దీనికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత శాఖలతో చర్చించి, నిధులు మంజూరు చేయించడంతో ఇప్పుడు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఎమ్మెల్యే చొరవతో ప్రారంభమైన ఈ పనులు పూర్తయితే, కుషాయిగూడ వార్డు కార్యాలయం పరిసరాల నుంచి కుమ్మరి బస్తీ వరకు నీటి నిల్వ సమస్య పూర్తిగా తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. వర్షాకాలంలో మురుగు మరియు వరద నీటి మిళితం కారణంగా కలిగిన ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు అన్నారు.కార్యక్రమంలో స్థానిక కుటుంబాలు, మహిళలు, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పనగట్ల చక్రపాణి గౌడ్, యాదయ్య, చల్ల వెంకటేష్, నల్లచెరువుల జనార్ధన్, కిషోర్, సాయికిరణ్, నరసింహులు, నందు, పిట్ల రాజు, సాయినాథ్, చర్లపల్లి కాలనీ సమాఖ్య (సిసిఎస్) అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, సారా అనిల్ ముదిరాజ్, మొగిలి రాఘవరెడ్డి, జై కృష్ణ, శ్రీశైలం, దాసరి కనకయ్య, సంపత్, శేఖర్ నాయక్, వెంకటేష్, సాయిబాబ, ప్రసాద్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Comments