వరద బాధితలు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండండి
-జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబశ్శిర్ ఉజ్ జఫర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
బుధవారం స్థానిక కార్యాలయంలో వరద బాధిత లకు బియ్యం, నిత్యావసర సరుకులతో పాటుగా వంట సామాన్లు, స్టీల్ సామాన్లు, చాపలు ,బ్లాంకెట్స్ తదితర వస్తువులు జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబశ్శిర్ ఉజ్ జఫర్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాదిఖ్ అహ్మద్, రాష్ట్ర మాజి కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్, జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా, మోతి మస్జిద్ ఇమామ్ సాబ్ మౌలానా అబ్దుల్ ఘని వరద బాధిత లకు అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం నగర పరివాహకం లోని మున్నేరు నది వరద ముంచేత్తి నీటిలో పూర్తిగా మునిగిపోయి నిరాసులైన వివిధ వాసులకు గత వారం రోజులుగా జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో నిరంతరంగా వరద బాధితలకు సేవా కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. ఈ విపత్తు చాలా బాధాకరమని చాలా మంది నిరాశ్యులయ్యారని వారి సహాయార్థం నిత్యవసర సరుకులతో పాటుగా ఇతర వస్తువులకు సంబంధించిన కిట్టు అందిస్తున్నామని అన్నారు. భూ వాసి పై దయ చూపితే ఆకాశా వాసి మనపై దయ చూపుతాడు అన్నారు. వరద బాధితలు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్నారు.
లాప్ టాప్ , ప్రింటర్ అందజేత
ఖమ్మం పట్టణంలోని సారది నగర్ ప్రాంతానికి చెందిన ఇష్రత్ పర్వీన్ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న తరుణంలో గత పది రోజుల క్రితం వచ్చిన వరదలకు తమ యొక్క పుస్తకాలు లాప్ టాప్, ప్రింటర్ అన్ని నీటిపాలయ్యాయి. ఈ విషయం తెలిసిన జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఇష్రత్ పర్వీన్ కు లాప్ టాప్ ప్రింటర్ జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబశ్శిర్ ఉజ్ జఫర్ చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇష్రత్ పర్వీన్ మాట్లాడుతూ నా చదువు యొక్క సామాగ్రి సర్వం నీటిపాలై ధైర్యం కోల్పోయి దిగులుగా ఉన్న సమయంలో నా దగ్గరికి దేవుడు జమాఅతె ఇస్లామి హింద్ సభ్యులను పంపించి సరైన సమయంలో సహాయం అందించారు. నేను కూడా ప్రయోజకు రాలై పేదలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యాక్రమమలో జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ సమి, ఖిల్లా, ఇంద్రనగర్, ఇస్లాంపేట అధ్యక్షులు అబ్దుల్ మలిక్, అబ్రార్ అలీ, షేక్ రఫీ సభ్యుల అబ్దుస్ సుబూర్, అక్బర్ మూసా, యసుఫ్ షరీఫ్, నిజాముద్దీన్, గౌస్, ఫయాజ్, అబ్దుల్ రజాక్ , ఇలియాస్, ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం మహిళా శాఖ ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్, ఇంద్రనగర్ అధ్యక్షురాలు హుస్సేన్ బీ, ఇస్లాంపేట అధ్యక్షురాలు ఖాసిమ షాహిన్ తదితరులు పాల్గొన్నారు.


Comments