వెల్టూర్ గ్రామంలోని ప్రధాన రహదారి పై వరద నీరు

-- వరద నీటిని వెంటనే తొలగించాలని కోరుతున్న గ్రామస్తులు

వెల్టూర్ గ్రామంలోని ప్రధాన రహదారి పై వరద నీరు

 వనపర్తి జిల్లా ప్రతిని తెలంగాణ ముచ్చట్లు: 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని ప్రధాన రహదారి పై పూర్తిగా వరద నీరు చేరింది. దాదాపు మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని, వెంటనే అధికారులు స్పందించి వరద నీటిని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి పై వరద నీరు రావడంతో వ్యాపారస్తులు, వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రహదారికి అనుకొని ఉన్నటువంటి ఇంటి యజమానులు వరద నీరు పోవడానికి సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా... రహదారి కి ఆనుకొని ఉన్న ఇంటి యజమానులతో మాట్లాడి, గ్రామ పెద్దల సహకారంతో వరద నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ ప్రజల సహకరించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .