రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

సీఐ జి వేణు

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు :

తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే  వెంటనే కేసు నమోదు చేసి సీజ్ చేస్తాం 

డ్రగ్స్ గంజాయి గుట్కా లాంటి మారకద్రవ్యాలు తరలిస్తే కఠిన చర్యలు

రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని స్టేషన్ ఘనపూర్ పోలీస్ సూచించారు సోమవారం సీఐ వేణు ఆదేశాల మేరకు ఏఎస్ఐ రాజమౌళి వాహన తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన తెలంగాణ ముచ్చట్లు పత్రికతో మాట్లాడారు. వివిధ పనులు అవసరాల కోసం బయటికి వెళ్లిన ప్రజలు సురక్షితమైన ప్రయాణం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలిమెంట్ లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు వారి కుటుంబాలు అనాధలుగా మిగులుతున్నారని ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెంట్ వినియోగించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతే పట్టుబడినప్పుడు సంబంధించిన ల్లిదండ్రుల పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేకుండా కనిపించే వాహనాలను, ప్రధానంగా ట్రాక్టర్లు అధికంగా కనిపిస్తున్నాయి. పట్టుబడినప్పుడు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

మద్యం మత్తులో డ్రైవింగ్, రాంగ్ రూట్లో డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయ్యోద్దని,  జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రగ్స్ గంజాయి గుట్కాలు లాంటి మాదకద్రవ్యాలకు వాహనాలపై తరలించిన వాటిని వాడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో రజాక్ పాషా, హెడ్ కానిస్టేబుల్ యాకాంబరం, సిబ్బంది మగ్గం, గౌస్ పాషా, గోవింద్, గన్ మెన్ కుమార్. రవికుమార్ లు పాల్గొన్నారు. 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .