ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్ ను సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుధీర్ ను సన్మానించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి,ఆగస్టు20(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్ కుమారుడు సుధీర్ కుమార్ ఇటీవల ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) నిర్వహించిన పోటీ పరీక్షలలో జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన సుదీర్ ను బుధవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుతరం యువత దీక్ష,దక్షత,పట్టుదలతో కష్టపడితే వివిధ రంగాలలో అద్భుతాలు సృష్టిస్తారు అని గతములో కేంద్ర సర్వీసులలో చూస్తే ఎక్కువ కేరళ,తమిళనాడు,బీహార్ ప్రాంతాల విద్యార్థులు విజయం సాధించేవారని,నేడు పరిస్థితి చూస్తే దశాబ్ద కాలంగా తెలంగాణలో కేంద్ర సర్వీసులలో యువత ప్రతిభ కనపరుస్తూ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని దీనికి కారణం తెలంగాణలో సుస్థిర ఆర్థిక ప్రగతి సాధించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నారని అంతే స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహించడం కూడా శుభపరిణామమని అన్నారు.సుధీర్ మరింత ఉన్నతస్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు.ఈ సందర్భంగా సుదీర్ కుమార్ తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమములో గట్టు యాదవ్,పలుస.రమేష్గౌడ్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,రఘువర్ధన్రెడ్డి,మాజీకౌన్సిలర్స్ఉంగ్లం.తిరుమల్,కంచ.రవి,మహేశ్వర్రెడ్డి,జోహెబ్,హుస్సేన్, చిట్యాల.రాము,మల్లికార్జున స్వామి,పెండెం.శ్రీనివాసులు,వెంకటస్వామి,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .