నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ
Views: 2
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదివారం ఖమ్మం కార్పోరేషన్, బోనకల్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. ఖమ్మం లెనిన్‌నగర్‌కు చెందిన బొడ్లపాటి నాగేశ్వరరావు-కరుణ దంపతుల కుమారుడు సాయి చరణ్ వివాహం, హైదరాబాద్ వాస్తవ్యులు దాములూరి కృష్ణారావు-నాగేంద్రమణి దంపతుల కుమార్తె వైష్ణవితో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నామ నూతన వధూవరులను ఆశీర్వదించి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పిల్లల పాపలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. నామ వెంట కనకమేడల సత్యనారాయణ, గొడ్డేటి మాధవరావు, మోరంపూడి ప్రసాద్ రావు, మారెడ్డి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments