సిసి రోడ్లకు శంకుస్థాపన
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్
చిల్కానగర్, అక్టోబర్ 7 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిల్కానగర్ డివిజన్‌లో ఇందిరానగర్, సీతారామ కాలనీ, సాయిరాం నగర్ కాలనీ, రాఘవేంద్ర నగర్ కాలనీలలో మొత్తం రూ.1 కోటి 20 లక్షల రూపాయల వ్యయం తో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ మరియు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “చిల్కానగర్ డివిజన్ అభివృద్ధిలో ముందంజలోఉంది. కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ప్రజలతో మమేకమై ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు డివిజన్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 20 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం” అని అన్నారు.కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ, “ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం. డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించడంలో సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు కాలనీల అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments