కీసరలో ఉచిత మెగా వైద్య శిబిరం

కీసరలో ఉచిత మెగా వైద్య శిబిరం

కీసర, నవంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు)

కీసర మండలంలోని జిన్నారం కాలనీ(జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీ),రాంపల్లి–దాయరా ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈసీఐఎల్, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు కుషాయిగూడ నవోదయ సంక్షేమ వేదిక సంయుక్తంగా, సిఐటియు కీసర మండల కమిటీ సహకారంతో నిర్వహించారు.శిబిరాన్ని నవోదయ సంక్షేమ వేదిక అధ్యక్షురాలు శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, రాబోయే రోజుల్లో మరిన్ని శిబిరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు తెలిపారు.
పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ చనమోలు వరప్రసాద్ మాట్లాడుతూ పేదలకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించడం తోపాటు స్పెక్ట్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. సిఐటియు కార్యదర్శి నర్సింగరావు మాట్లాడుతూ కార్మికుల కాలనీల్లో కాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను కూడా నిర్వహించనున్నట్టు చెప్పారు.
కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ వైద్యులు కంటి పరీక్షలు, దమ్మాయిగూడ పద్మసాయి డెంటల్ క్లినిక్ డాక్టర్ దినేష్ బృందం దంత పరీక్షలు, పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున డాక్టర్ దేవిక జనరల్ పరీక్షలు నిర్వహించారు.WhatsApp Image 2025-11-09 at 8.57.25 PMఈ శిబిరంలో మొత్తం 227 మంది పాల్గొని అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 17 మంది పేదలకు కాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయబడుతున్నాయి. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంప్ కన్వీనర్ సునీల్ కుమార్, ట్రస్ట్ నాయకులు జివి రావు, కాలనీ వెల్ఫేర్ నాయకులు సి.హెచ్. అశోక్, సుదర్శన్, మంగ్ల నాయక్, బానోత్, లక్ష్మణ్, పద్మయ్య, చంద్రయ్య, చారి, సరోజ, ముత్యాలు, చంద్రకళ, పల్లవి, సుల్తానా, కళ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .