ఓరుగల్లు ప్రజలకు కేంద్రం నుండి మరో హామీ నెరవేర్పు
కాజీపేట,తెలంగాణ ముచ్చట్లు:
హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ పరిధిలో అయోధ్యపురంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మడికొండ చౌరస్తాలో మీడియా సమావేశం నిర్వహించారు వర్ధన్నపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు అరూరి రమేష్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాజీపేట రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్‌ను అప్‌గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇటీవల గిరిజన వర్సిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం పట్ల ప్రజల్లో ఉత్సాహం నెలకొన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, మాజీ ఎమ్మెల్యేలు వన్నాలశ్రీరాములు, తక్కల్లపల్లి రాజేశ్వరరావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, జలగం రంజిత్, కరుణాకర్, వెంకట్రావు, గడ్డం మహేందర్, పిట్టల రమేష్, దువ్వ నవీన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


Comments