రాష్ట్ర బంద్‌కు ఎల్కతుర్తి మండలంలో పూర్తి మద్దతు

రాష్ట్ర బంద్‌కు ఎల్కతుర్తి మండలంలో పూర్తి మద్దతు

ఎల్కతుర్తి, అక్టోబర్18 (తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌కు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) మద్దతు ప్రకటించింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో బంద్ విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా మండలంలోని అన్ని వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, వైన్ షాపులు, వివిధ రకాల దుకాణాలుమూసివేయబడ్డాయి.సిపిఐ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆగస్టు 31న ఆమోదించిన బిల్లును గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంచడం విచారకరమని పేర్కొన్నారు. ఈ బిల్లును వెంటనే ఆమోదించి కేంద్రానికి పంపి, కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ–లోకసభల్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గవర్నర్ ఆమోదం లేకపోవడంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ పరిమితి కారణంగా ఎన్నికలు నిలిపివేయడం జరిగిందని, దీని వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరు రాములు, కర్రే లక్ష్మయ్య, జిల్లా సమితి సభ్యులు మరి శ్రీనివాస్, సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నిమ్మల మనోహర్, తండముండయ్య, వేముల కృష్ణకర్, హిమ్జాల పోశయ్య, మర్రి విజయ్, భాషిక, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .