మారుమూల గిరిజన ప్రాంతాలకు నిధులు కేటాయించాలి
-ఐటిడిఏ పిఓ బి రాహుల్
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి గిరిజన గ్రామాలలోని గిరిజనులకు అనేక అభివృద్ధి పనులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బృందం సభ్యులకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలలోని గిరిజన గ్రామాలలో గిరిజన కుటుంబాలకు మౌలిక వసతులు కల్పన కొరకు అధ్యయనం చేయడానికి వచ్చిన భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బృందం సభ్యులు తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల కుటుంబాలు మరియు గిరిజన పిల్లల కొరకు విద్యా వైద్యం గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు సిఎస్సార్ ద్వారా నిధులు మంజూరు చేయాలని అన్నారు. గిరిజన గ్రామాలలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, భద్రాచలం పట్టణంలోని ఏరియా ఆసుపత్రి, ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను సందర్శించడం జరిగిందని బృందం సభ్యులు పిఓ కి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మరియు బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments