బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ

బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ

ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు): 

పూలే–అంబేద్కర్ స్ఫూర్తి గ్రూప్ ఎన్ఎఫ్సీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 7 గంటలకు కమలానగర్ సిఐటియు ఆఫీస్ ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ మరియు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన కర్తవ్యం పై చర్చ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూపు ఎన్ఎఫ్సీ నిర్వాహకులు గోవిందు అధ్యక్షతన నిర్వహించారు. ఎన్ఎఫ్సీ సీనియర్ ఆఫీసర్ మల్లేశం, లక్ష్మయ్య, సామాజిక ఉద్యమ నేత కోమటి రవి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కే. మల్లేశం మాట్లాడుతూ, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన విధానం ప్రత్యేకమని, అది అలనాటి మనువాద నిచ్చెనలకు భిన్నంగా, “మానవులందరూ ఒకటే” అనే సూత్రాన్ని ప్రాతిపదికగా తీసుకున్నట్లు గుర్తుచేశారు. విద్యను అందించడం, సమాన అవకాశాలు కల్పించడం కోసం ఎస్సీ–ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా అనేక మంది అభివృద్ధి సాధించారని ఆయన పేర్కొన్నారు. సామాజిక ఉద్యమ నేత రషీద్, నల్లమల అడవుల్లో చెంచుల జీవన పరిస్థితులను పరిశీలించి వీడియోలు తీసి, వారి బతుకుల పరిస్థితులు నేటికీ దుర్భరంగా ఉన్నట్లు వివరించారు. గొడుగు యాదగిరిరావు, లక్ష్మయ్య, ఎం. భాస్కర్ రావు, సురేష్, గోవిందు తదితరులు ప్రసంగాలు చేశారు. అనంతరం సురేష్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .