కలెక్టరేట్ లో అధికారికంగా జి. వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం

కలెక్టరేట్ లో అధికారికంగా జి. వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం

ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు:

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఆదివారం  అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. కళావతి బాయి, ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు తదితరులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా దేశానికి సేవలు అందించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .