నేటి నుండి ఘనంగాశ్వేతార్క గణపతి నవరాత్రి ఉత్సవాలు
కాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు
కాజీపేటలోని ప్రసిద్ధి చెందిన శ్వేతార్క మూల గణపతి నవరాత్రి ఉత్సవాలను నేటి నుండి 16 రోజులపాటు ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లను పూర్తి చేశామని ,షోడశ నవరాత్రి ఉత్సవాలు, కళ్యాణోత్సవం ను విజయవంతం చేయాలని దేవాలయ వైదిక కార్యనిర్వాహణాధికారులు బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణశర్మ, పరిపాలన నిర్వాహకులు సాయి కృష్ణ శర్మలు కోరారు. ఆలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది 16 రోజుల పాటు నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మశ్రీ అన్నవర్జుల భరత్ కుమార్ శర్మ పర్యవేక్షణలో ప్రధాన యాజీకమును శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాదీశులు మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకో విధంగా ప్రత్యేక పూజలు, హోమాలు, దర్బారు సేవ, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించబడతాయని వారు పేర్కొన్నారు. వివిధ జిల్లాల ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు దేవాలయ నిర్వాహకులు ఏర్పాట్లను చేసినట్లు వారు వెల్లడించారు. దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారి పేర్కొన్నారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం నవరాత్రి ఉత్సవాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్ అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాయ మేనేజర్ లక్క రవి, గురు స్వామి సదానందం లతో పాటు తదితరులు పాల్గొన్నారు.


Comments