శరన్నవరాత్రి వేడుకల్లో వైభవం
శ్రీ సాయి ఆంజనేయ స్వామి దేవాలయం కుంకుమార్చనలో మహిళా భక్తులు
Views: 14
On
నాగారం, సెప్టెంబర్ 26(తెలంగాణ ముచ్చట్లు) :
నాగారం మున్సిపాలిటీ 9వ వార్డు ఎస్వి నగర్ కాలనీ రోడ్ నెం.7లోని శ్రీ సాయి ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఐదో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి, మహిళా భక్తులతో కలిసి ప్రత్యేక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దారూరి హరికృష్ణమాచార్యులు పూజ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి, మంజుల, శాంతి, లలిత, సుమలత, అనురాధ, సునీత, శ్యామల, ప్రత్యూష, శ్రీదేవి, భాగ్యలక్ష్మి తదితర భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments