1.5 లక్షల విలువైన బంగారం,వెండి ఆభరణాలు దొంగలింపు
Views: 11
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
రూ.1.5 లక్షల విలువైన బంగారం,వెండి ఆభరణాలు దొంగలించబడిన ఘటన మంగళవారం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే ..రాంపూర్ గ్రామానికి చెందిన ఆబోతు లక్ష్మి,ఆమె భర్త రాములు తమ ఇంటికి తాళం వేసి మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో కూలి పనికి వెళ్ళిపోయారు.సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు తిరిగి ఇంటికి వచ్చిన లక్ష్మి,ఇంటి తాళం పగలగొట్టి, మూడు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు దొంగిలించబడ్డాయని గుర్తించారు.దొంగలించిన ఆభరణాల విలువ సుమారు రూ.1,50,000 లుగా ఉంటుందని సమాచారం.ఈ ఘటనపై ఆబోతు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా,వారు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments