జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం.

- పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో.

- వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపుపై తీపి కబురు.
- టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి ప్రకటన.

సత్తుపల్లి, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టుల చిరకాల సమస్యలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల కేటాయింపును పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని తెలిపారు.
శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో అత్యవసరంగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి రావడంతో ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ కార్డులు అందేలా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఇళ్ల స్థలాలపై స్పష్టమైన హామీ
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విస్తృతంగా చర్చించామని మంత్రి వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల కారణంగా కొంత ఆలస్యం జరిగిందని పేర్కొంటూ, వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన ఉద్ఘాటించారు.

ఈ మహాసభకు అతిథిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి జర్నలిస్టుల సేవలను కొనియాడారు. సమాజంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర అమూల్యమని పేర్కొంటూ, వారి సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. సమిష్టిగా ముందుకు సాగాలి
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించుకున్నందుకు నేతలు హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులను అభినందించారు. 

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.IMG-20251220-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .