గౌడ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమం
విద్యతోనే కులం అభివృద్ధి
గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం పట్టణంలోని ఆదివారం మంచి కంటి భవన్లో గోపా జిల్లా అధ్యక్షుడు బూడిద శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ ఉద్యోగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌడ అఫీషియల్స్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఇటీవల నూతనంగా ఉద్యోగాలు సాధించిన గౌడ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలుపుతూ... గీత కార్మిక కుటుంబాలలో పుట్టి సుమారు 60 మంది ఉద్యోగాలు పొందడం అభినందనీయమని, విద్యతోనే కులం అభివృద్ధి చెందుతుందని కావున గౌడ విద్యార్థులు, విద్యార్థినీలు శ్రద్ధతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించలని ఆయన అభిప్రాయపడ్డారు. గౌడ ఉద్యోగులకు ఎల్లప్పుడు గోపా సంఘం సహాయ సహకారాలు అందించడంలో ముందు వరుసలో ఉంటుందన్నారు అనంతరం మరో అతిధి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న గౌడులందరినీ ఏకతాటిపై వచ్చేందుకు కృషి చేస్తానని, త్వరలోనే గౌడ విద్యార్థుల సౌకర్యార్థం ఖమ్మం పట్టణంలో గౌడ హాస్టల్ నిర్మించడానికి కృషి చేస్తానని , గోపా భవనం ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గుడిద శ్రీనివాస్ మాట్లాడుతూ
ఇటీవల ఉద్యోగం పొందిన గౌడ ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకొని రాబోవు కాలంలో మరిన్ని ఉద్యోగాలు పొందేందుకు గౌడ విద్యార్థుల సౌకర్యార్థం కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం
ఉద్యోగాలు పొందిన 60 మంది
ఉద్యోగస్తులకు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి క్యాష్ అవార్డుల ప్రధానం ఖమ్మం గోపా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారిని శాలువా మెమొంటో లతో ఘనంగా సత్కరించారు
ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ వి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి రామకృష్ణ గౌడ్, మధుసూదన్ గౌడ్, జాయింట్ కలెక్టర్ పర్శ రాంబాబు గౌడ్, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు కత్తి నెహ్రు గౌడ్, గౌడ జేఏసీ రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డెబోయిన నరసింహారావుగౌడ్, డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్ ,డాక్టర్ శ్రీధర్ గౌడ్, డాక్టర్ గోపగాని సురేందర్ గౌడ్, మార్కం లింగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు


Comments