పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
విత్తన మొక్కజొన్న పై రైతులకు అవగాహన...
ఖమ్మం బ్యూరో,నవంబర్ 10, తెలంగాణ ముచ్చట్లు;
సోమవారం వైరా మండలం గరికపాడు, దాచాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైరా డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ మట్టూరి వెంకటేశ్వర్ రావు , మరియు సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు పూర్తిగా ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపవలసిందిగా రైతులకు తెలియజేశారు.
గన్నీ రమ్మీ సంచులు అందుబాటులో ఉంచుకోవాలని సొసైటీ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజూఖాన్ వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు, సొసైటీ సీఈఓ అంజయ్య సొసైటీ డైరెక్టర్లు అదేవిధంగా సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
విత్తన మొక్కజొన్న పై రైతులకు అవగాహన...
అదేవిధంగా గరికపాడు లింగన్నపాలెం గ్రామంలో విత్తన మొక్కుజొన్న వేసే రైతులకు అగ్రిమెంటు లేకుండా కంపెనీ వారు ఇచ్చే మొక్కజొన్నని వేయకూడదని సూచించారు. అగ్రిమెంటు ఉంటేనే మొక్కజొన్న వేసేలా రైతులకు తెలియజేశారు. రైతులకు నష్టం రాకుండా అగ్రిమెంట్ తీసుకొని విత్తన మొక్కజొన్న వేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్,
మండల వ్యవసాయ అధికారి మాయన్ మంజుఖాన్ తెలియజేశారు.


Comments