ఘనంగా విజయ గణపతి దుర్గామాత ఆలయ వార్షికోత్సవం
Views: 14
On
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
గంగారం గ్రామంలోని విజయ గణపతి దుర్గామాత ఆలయం 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని పూజించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దాసరి వెంకటరామి రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారంతా సంయుక్తంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments