టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లాలో టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ నేతృత్వంలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి, జిల్లా ప్రజలకు, ఉద్యోగులకు, అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కలెక్టరేట్‌లో పండుగలు కుటుంబసభ్యుల్లా జరుపుకోవడం ఆనందకరమైనది. ఈ వేడుకలను విజయవంతం చేసిన టీ ఎన్ జీ ఓస్ యూనియన్‌కు అభినందనలు,” అని తెలిపారు.

యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ, “క్రిస్మస్ వేడుకలు కలెక్టర్ నేతృత్వంలో ఘనంగా జరగడం ఉద్యోగులందరికీ ప్రత్యేక అనుభూతిని కలిగించింది,” అని పేర్కొన్నారు. అనంతరం హాజరైన వారికి క్రిస్మస్ కేక్, స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకరెడ్డి, డీఆర్ఓ గణేష్, డిఆర్డిఎ పీడీ మేన శ్రీనివాస్, డిఎంహెచ్‌ఓ అప్పయ్య, ట్రెజరీ అధికారులు, యూనియన్ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .