ఉత్తమ సేవల ప్రశంసా పత్రము పొందిన హకీమ్ కి ఘన సన్మానం
Views: 7
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ఎంపిజే కోశాధికారి ఎండి హకీమ్ ని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఎస్. కే. ఖాసిమ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15 సందర్భంలో, ఖమ్మం మేయర్ పునకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మునిసిపల్ కమీషనర్ అగస్త్య చేతుల మీదుగా, హకీమ్ కి ఉత్తమ సేవల ప్రశంసా పత్రము అందజేయ బడింది. ఈ ఘనతను పురస్కరించుకొని, ఎంపిజే సభ్యులు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంపిజే అధ్యక్షులు షేక్ ఖాసీమ్, ఉపాధ్యక్షులు ఎండి. జహీర్, ఎండి. రజబాలి, కార్యదర్శులు సయ్యద్ రఫీక్, బి. సతీష్, సభ్యులు ఎండి. గఫార్, ఎస్. కె. హుసేన్ మియా, ఎండి. ఎమ్మాద్, రహేమాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments