హనుమకొండ జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం

హనుమకొండ జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. 2024-25 సంవత్సరానికి నిర్దేశించబడిన వార్షిక రుణ ప్రణాళిక ₹7413.22 కోట్లకు గాను, రెండవ త్రైమాసికంలో ₹3773.14 కోట్ల రుణమంజూరీ జరిగింది.

ప్రాధాన్యతా రంగాల్లో వ్యవసాయానికి ₹2305.71 కోట్లు, పరిశ్రమలకు ₹1400.70 కోట్లు, విద్యారుణాలకు ₹16.03 కోట్లు, గృహనిర్మాణం కోసం ₹22.00 కోట్లు, ఇతర రంగాలకు ₹87.58 కోట్లు మంజూరీ అయ్యింది. ఇతర రంగాలకు ₹5081.27 కోట్ల రుణమంజూరీ జరిగింది.

ప్రజలకు ఆర్ధిక అవగాహన కల్పించే క్రమంలో “ఖాతాదారునకు చేరువ” వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జీవన జ్యోతి భీమా యోజన కింద 110439 మందికి భీమా సౌకర్యం, సురక్ష భీమా యోజన ద్వారా 331587 మందికి భీమా అందించడం జరిగింది. అటల్ పెన్షన్ యోజన కింద 54523 మంది ఖాతాదారులకు పెన్షన్ సౌకర్యం కల్పించారు.

అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, కొన్ని బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడంలో వెనుకబడ్డాయని, ఈ సంవత్సరం లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్, పీఎం ఎఫ్‌ఎమ్‌ఇ, ఎఐఎఫ్, పొదుపు సంఘాలకు సోలార్ యూనిట్స్ కోసం రుణాలు అందించాలన్నారు. పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయని బ్యాంకులను మందలించారు. పీఎంఈజీపీ, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాలపై బ్యాంకులు ఆలస్యం చేయకూడదని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏ.జి.ఎం. చంద్రశేఖర్, ఆర్.బి.ఐ అధికారి పల్లవి, డి.ఆర్.డీ.ఓ. శ్రీను, ఏపీజీవీబీ ఆర్.ఎం. చైతన్య మరియు ఇతర బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .