హనుమకొండ, వరంగల్ జిల్లాల అభివృద్ధి పనులపై సిఎం ప్రత్యేక కార్యదర్శి సమీక్ష

హనుమకొండ, వరంగల్ జిల్లాల అభివృద్ధి పనులపై సిఎం ప్రత్యేక కార్యదర్శి సమీక్ష

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఇతర ప్రతిపాదిత అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సమీక్షించారు.  

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 9వ తేదీన జిల్లా పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కుడా ఆధ్వర్యంలో చేపడుతున్న కాళోజీ కళా క్షేత్రం, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియ, వరంగల్ బస్టాండ్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, స్మార్ట్ సిటీ, ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతిపాదిత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, ఆక్సిజన్ పార్క్, వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనుల పురోగతి పై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేలతో పాటు కుడా, మున్సిపల్, ఆర్ అండ్ బీ, సాగునీటి పారుదల, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా రెండు జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జిల్లాల్లో చేపట్టిన, చేపట్టనున్న ప్రతిపాదిత అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి , హనుమకొండ,నర్సంపేట ఆర్డీవోలు వెంకటేష్, కృష్ణవేణి, ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .