చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి కి కాంగ్రెస్ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు
ఉప్పల్/మేడ్చల్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీలు మందుముల పరమేశ్వర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్స రెడ్డి, సీనియర్ నేత బూపతి రెడ్డి లు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో మహేందర్ రెడ్డి చేసిన సేవలు విశేషమని, ఆయన ఎల్లప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అభినందించారు. పట్నం మహేందర్ రెడ్డి ఆరోగ్యంగా ఉండి, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.అలాగే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాలను సమానంగా ముందుకు తీసుకువెళ్లే విధానంలో పట్నం మహేందర్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.జన్మదిన వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.


Comments