ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
Views: 35
On
ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు..
కాజిపేట్ బాపూజీ నగర్ లోని పోచమ్మ గుడి సమీపం లో తేజోమయి మాల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆ సంఘ సభ్యులు మాట్లాడుతూ మహిళలతోపాటు బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య అందించాలని, పోరాట స్ఫూర్తిని చాటిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని పలువురు కొనియాడారు. ఆమె చూపిన మార్గం సదా ఆచరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పప్పుల గోవర్ధన్, ముఖ్య సలహాదారులు కొండ్ర నర్సింగ్ రావు, బోయిని వెంకట్రావు, తండమల్ల వేణు, పరుష వెంకటరాజు, శేఖర్ బాచి, రాజేష్, మధ్యల కార్తీక్, బరాబరిశ్రీకాంత్ లతోపాటు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments