మెడికేర్ లో ఇండస్కన్ అంతర్జాతీయ సదస్సు
వివిధ కాలేజీల నుండి 1000 మంది విద్యార్థుల హాజరు
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:
రోగులకు సరైన చికిత్స అందించటంలో డాక్టర్లు, ఫార్మసిస్టుల పాత్ర ప్రాధానం అని సెంట్రల్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ కేర్ ఫార్మసీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ డి సుధీర్ కుమార్ అన్నారు. ఆదివారం హంటర్ రోడ్డులో గల మెడికేర్ హాస్పిటల్, తాళ్ళ పద్మావతి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో చైర్మన్ తాళ్ళ మల్లేశం అధ్యక్షతన ఇండస్కన్ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కేర్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఔషద రంగంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని బి ఫార్మసీ, ఫార్మ్ డీ ఉన్నత అవకాశలు లభిస్తాయని అన్నారు. అనంతరం యూనివర్సిటి ఆఫ్ ఫ్రెండ్ లే డాక్టర్ చంద్రశేఖర్, కేయూ ఫార్మసీ కాలేజి డీన్ డాక్టర్ జి.సమ్మయ్య లు మాట్లాడుతూ విద్యార్ధుల నైపుణ్యతను, ఫార్మసి రంగం పై పూర్తి అవగాహనకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. చివరగా ప్రత్యేక అతిధులుగా విచ్చేసిన బైరీ మీడర్, సార అండర్సన్ , డాక్టర్ షాలక సోమయాజి ఫార్మసీ వర్క్ శాపులు మెడిసిన్ దోసేజీల రీసెర్చి గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. చివరగా అతిథులకు శాలువా, మేమెంటోలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పిటర్స్ ఛైర్మన్ నారయణ రెడ్డీ, అవినిడా ఇన్నోవేషన్ సీఈవో డాక్టర్ కార్తీక్, మెడికేర్ హాస్పిటల్ డెరైక్టర్ డాక్టర్ చిన్నప్ప రెడ్డి, డాక్టర్ మేఘన, తాళ్ళ పద్మావతి కలశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే వెంకటేశ్వర్లు, తాళ్ళ వరుణ్, వైష్ణవి, వివిధ ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్ లు, డాక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments