తెలంగాణలో ఇంట్లో దావత్ చేసుకుంటుంటే ఎంత మద్యం కలిగి ఉండొచ్చు..?

తెలంగాణలో ఇంట్లో దావత్ చేసుకుంటుంటే ఎంత మద్యం కలిగి ఉండొచ్చు..?

డెస్క్,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్-1968లో పొందుపరిచన వివరాల ప్రకారం..  రాష్ట్రంలో లిక్కర్ తయారీ, అమ్మకాలు వంటివి ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉంటాయి. ఒక వ్యక్తి… 6 ఫుల్ బాటిళ్ల లిక్కర్ అంటే… 4.5 లీటర్లు, 12 బీర్లు కలిగి ఉండే వెసులుబాటు ఉంది. అయితే ఫ్యామిలీ పార్టీ చేసుకునేటప్పుడు..  మందు పార్టీ చేసుకోవడానికి 6 బాటిళ్ల కంటే ఎక్కువ లిక్కర్ కొనుగోలు చేయాల్సి వస్తే, ఆ పార్టీ ఇచ్చే వ్యక్తి ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు వివరాలతో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టుకుంటే.. ఉన్నతాధికారులు పరిశీలించి పర్మిట్స్ జారీ చేస్తారు. అనుమతి సాధారణంగా 48 గంటల్లో జారీ చేయబడుతుంది.అయితే ఈ పార్టీ నిర్వహణ అనుమతి కోసం చలాన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. GHMC పరిధిలో కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో  9వేల రూపాయలు, అదే 4 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో పార్టీ చేసుకుంటే 12 వేల రూపాయలు చెల్లించాలి. GHMCతో పాటు 5 కిలోమీటర్ల పరిధిలో ఒక రోజుకు 12 వేల రూపాయలు కట్టాలి. 4 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లోహోటళ్లలో పార్టీ నిర్వహిస్తే 20 వేల రూపాయలు చెల్లించాలి. హాజరయ్యే వారి సంఖ్యను బట్టి ఈ చలాన్ అమౌంట్ పెరుగుతుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .